utham: ఈ రోజు 3 గంటలకి ప్రెస్‌మీట్ పెట్టి మరిన్ని విషయాలు చెబుతాం: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీలోకి వారికి స్వాగతం
- ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్‌మీట్
- కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి గ్రూపులు లేవు
- 2019లో అధికారం మాదే
తమ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలోకి వారికి స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. తమ పార్టీలో వారందరూ చేరినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి తాము ప్రెస్మీట్లో మాట్లాడుతామని, మరిన్ని విషయాలు చెబుతామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి గ్రూపులు లేవని, అందరూ ఐక్యంగా ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2019లో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నుంచి కూడా పలువురు నేతలు తమ పార్టీలో చేరారని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా కొందరు చేరారని చెప్పారు.