revant reddy: ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో రేవంత్ అండ్ కో.,

  • కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్న మాజీ టీడీపీ నేతలు
  • కుంతియాతో భేటీ
  • కాసేపట్లో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ ఛార్జ్ కుంతియాతో ఆయన భేటీ అయ్యారు. రేవంత్ తో పాటు టీడీపీకి గుడ్ బై చెప్పిన ఇతర నేతలు వేం నరేందర్ రెడ్డి, సీతక్క, విజయరమణారావు, అరికెల నర్సారెడ్డి, బోడ జనార్దన్, సోయం బాబురావు, జంగయ్య, బిల్యా నాయక్, రమేష్ రెడ్డి, శశికళ తదితరులు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. కాసేపట్లో వీరంతా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

మరోవైపు, పార్టీలోకి వీరి రాకను కొందరు నేతలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఎంతోకాలం నుంచి పార్టీ కోసం పని చేస్తున్నవారిని కాదని... కొత్తవాళ్లను పార్టీలోకి చేర్చుకోవడం భావ్యం కాదని వారు అన్నారు. మొన్నటి దాకా కాంగ్రెస్ ను తిట్టిన వారిని... పార్టీలోకి చేర్చుకోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని కలసి, తమ అభిప్రాయాలను ఆయనకు వెల్లడిస్తామని చెప్పారు. 

revant reddy
tTelugudesam
congress
rahul gandhi
kuntia
  • Loading...

More Telugu News