hardhik patel: బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డ యువనేత హార్దిక్ పటేల్

  • మళ్లీ అధికారంలోకి రావడానికి బీజేపీ యత్నిస్తోంది
  • దీని కోసం మూడు అంశాలను వాడుకోవాలనుకుంటోంది
  • కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన హార్దిక్

గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్ కల్పించాలంటూ భారీ ఉద్యమాన్ని నడుపుతున్న పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ బీజేపీపై మరోసారి మాటల తూటాలు పేల్చారు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ... అందుకోసం ఉగ్రవాదం, హిందూ-ముస్లిం విభేదాలు, గోవధ.. వంటి మూడు అంశాలను అస్త్రాలుగా వాడుకోవాలని భావిస్తోందని ఆరోపించారు.

మరోవైపు తమ సామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో హార్దిక్ చర్చలు జరిపారు. అయితే, ఈ చర్చల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. దీంతో, నవంబర్ 7న కాంగ్రెస్ నేతలతో హార్దిక్ మరోసారి భేటీ కానున్నారు. అయితే, ఇవే చివరి చర్చలు అని హార్దిక్ స్పష్టం చేశారు. 

hardhik patel
patidar anamath andolan samithi
gujarat elections
bjp
congress
  • Loading...

More Telugu News