majoj tiwari: ఫోన్ పోగొట్టుకున్న బీజేపీ ఢిల్లీ చీఫ్.. వెతికే పనిలో పడ్డ పోలీసులు!

  • స్వదేశీ జాగరణ్ మంచ్ ర్యాలీలో పాల్గొన్న మనోజ్ తివారీ
  • ఐఫోన్ పోగొట్టుకున్న బీజేపీ ఢిల్లీ చీఫ్
  • చోరీ అయిందంటూ పోలీసులకు ఫిర్యాదు

బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీకి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే, ఆరెస్సెస్ వాణిజ్య విభాగమైన స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో 'చైనా వస్తువులను బహిష్కరించాలి' అంటూ ఓ ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మనోజ్ తివారీ కూడా హాజరయ్యారు. చైనా వస్తువులను బహిష్కరించాలంటూ ఆయన నినదించారు. అయితే, సభ ముగిసిన తర్వాత తన ఐఫోన్ 7ప్లస్ ఫోన్ పోయినట్టు గుర్తించారు. ఈ ఫోన్ ను అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ తయారు చేస్తోంది.

ఫోన్ పోయిందని తెలిసిన వెంటనే ఆయన అనుచరులంతా దాని కోసం ఆ ప్రాంతంలో ఎంతగానో వెతికారు. కానీ, అది దొరకలేదు. దీంతో, తన ఫోన్ చోరీకి గురైందంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్ తివారీ అధికారపక్షానికి చెందిన ఎంపీ కావడంతో... ప్రస్తుతం పోన్ ను కనిపెట్టే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. భోజ్ పురి నటుడిగా మనోజ్ కు ఎంతో ఫాలోయింగ్ ఉంది. 2014లో బీజేపీలో చేరిన ఆయన... ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 

majoj tiwari
delhi bjp president
actor manoj tiwari
bhojpuri actor
mp manoj tiwari
  • Loading...

More Telugu News