ntr: త్రివిక్రమ్ మూవీలో కొత్త లుక్ తో ఎన్టీఆర్

  • డిఫరెంట్ లుక్స్ తో సినిమాలు చేస్తోన్న ఎన్టీఆర్ 
  • త్రివిక్రమ్ కథకి తగినట్టుగా ఈ సారి క్లాస్ లుక్ 
  • జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్

ఎన్టీఆర్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉందనే సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపించనున్నట్టు తెలుస్తోంది. 'నాన్నకు ప్రేమతో' .. 'జనతా గ్యారేజ్' .. 'జై లవ కుశ' సినిమాల్లో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తూ వచ్చాడు.

ఎక్కువగా ఆయన గెడ్డం పెంచేసి రఫ్ లుక్ తో ఆ సినిమాలు చేశాడు. కానీ త్రివిక్రమ్ సినిమాలో పూర్తిగా షేవ్ చేసుకుని క్లాస్ లుక్ తో కనిపించనున్నట్టు సమాచారం. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కనుక .. ఆ లుక్ తో ఉండాలని త్రివిక్రమ్ చెప్పారట. అందువలన ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి భిన్నంగా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం అనూ ఇమ్మాన్యుయేల్ .. పూజా హెగ్డే పేర్లు వినిపిస్తున్నాయి.  

ntr
  • Loading...

More Telugu News