'బాహుబలి: ఆవేశంగా వస్తోన్న 'బాహుబలి' గెటప్‌లో రేవంత్ రెడ్డి ఫొటో... వర్మ క్రియేటివిటీ!
- రాజకీయాలపై కూడా స్పందిస్తూ మరింత వేడి పుట్టిస్తోన్న వర్మ
- కాంగ్రెస్ లో చేరనున్న రేవంత్ రెడ్డిపై పోస్టులు
- 'సాహోరే బాహుబలి రేవంత్ రెడ్డి' అంటూ వ్యాఖ్య
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య రాజకీయాలపై కూడా స్పందిస్తూ మరింత వేడి పుట్టిస్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడం తనకు చాలా చాలా హ్యాపీ అని పేర్కొన్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి చేరటంతో తనకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్లీ నమ్మకం వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి అని, బాహుబలి బాక్సాఫీస్ కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఓట్ల వర్షం కురిపిస్తాడని వ్యాఖ్యానించారు.
ఈ ఒక్క పోస్టుతో ఆ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదనేలా వర్మ ఇదే విషయంపై మరోసారి స్పందిస్తూ.. బాహుబలి గెటప్‌లో రేవంత్ రెడ్డిని చూపించారు. 'సాహోరే బాహుబలి రేవంత్ రెడ్డి' అంటూ ఈ ఫొటోను పోస్ట్ చేసి అలరించారు. ఈ పోస్ట్ పై స్పందిస్తోన్న నెటిజన్లు వర్మ క్రియేటివిటీని కాపీ కొట్టి తమకు ఇష్టమైన హీరోలని బాహుబలిలా రూపొందించి కామెంట్లు చేస్తున్నారు. మీరూ చూడండి... (బాహుబలి గెటప్‌లో పవన్ కల్యాణ్)