నాగార్జున: ‘నాతో ఉన్న వీళ్లందరి పేర్లు చెప్పగలరా?: ప్రశ్నించిన కింగ్ నాగార్జున

  • బాలీవుడ్ సహనటులతో నాడు దిగిన ఫొటో పోస్ట్ చేసిన నాగ్
  • ఆ నటీనటుల పేర్లు చెప్పమంటూ అభిమానులకు ప్రశ్న
  • స్పందించిన నెటిజన్లు

ప్రముఖ నటుడు నాగార్జున తాను గతంలో నటించిన బాలీవుడ్ సినిమాను గుర్తుచేసుకుంటూ ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఆ సినిమా పేరును చెప్పకుండా, అందులో నటీనటులతో కలిసి తాను దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్, అక్షయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

‘1990 లలో సహ నటీనటులతో కింగ్ నాగార్జున.. వీళ్లందరి పేర్లు చెప్పగలరా?’ అని తన ట్వీట్ లో నాగ్ పేర్కొన్నారు. అభిమానులతో పంచుకున్న ఈ ఫొటోపై కామెంట్స్ బాగానే వచ్చాయి. ‘అక్షయ్, పూజాభట్, మహేశ్ భట్, సోనాలి, రవీనా, పరేశ్ రావెల్, కింగ్ నాగార్జున’, ‘మూవీ నేమ్ అంగారే’, ‘అందమైన జ్ఞాపకాలు’ అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News