ట్రాఫిక్ పోలీస్: ట్రాఫిక్ పోలీస్ దగ్గర తప్పించుకోగలరేమో కానీ, నా దగ్గర కాదంటున్న యమధర్మరాజు: తెలంగాణ పోలీస్ వినూత్న ప్రచారం

  • వినూత్న పోస్టర్ ని ఆవిష్కరించిన డీజీపీ తెలంగాణ పోలీస్
  • ‘క్షేమం తలవండి, క్షేమంగా పనిచేయండి, క్షేమంగా ఉండండి’
  • వాహనచోదకులను ఆలోచింపజేసే రీతిలో రూపొందించిన పోస్టర్

వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరుతూ డీజీపీ తెలంగాణ పోలీస్ ఓ పోస్టర్ విడుదల చేసింది. వాహనచోదకులను ఆలోచింపజేసే విధంగా, చాలా ఆసక్తికరంగా ఈ పోస్టర్ ను రూపొందించారు. ‘క్షేమం తలవండి, క్షేమంగా పనిచేయండి, క్షేమంగా ఉండండి’ అని ట్వీట్ చేసి ఈ పోస్టర్ ను జతపరిచారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రయాణం చేస్తే ఎంత ప్రమాదకరమో తెలియజెబుతున్న ఈ పోస్టర్ గురించి చెప్పాలంటే.. తన వాహనంతో నిలబడి ఉన్న యమధర్మరాజు, ‘హెల్మెట్, సీట్ బెల్టు లేకుండా ట్రాఫిక్ పోలీస్ దగ్గర తప్పించుకోగలరేమో కానీ, నా దగ్గర కాదు’ అని వాహనచోదకులకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఈ పోస్టర్ ను రూపొందించారు. 

  • Loading...

More Telugu News