ram gopal varma: చిరిగిపోయిన పేజీలా వర్మా?... అయితే ఓకే!: 'ఎన్టీఆర్' సినిమాపై లక్ష్మీ పార్వతి

  • వర్మ మాటలతో సంతోషం కలిగింది
  • ఇంతవరకూ నన్ను సంప్రదించలేదు
  • స్క్రిప్టు నచ్చితే అంగీకరిస్తా
  • ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి

దివంగత మహానేత ఎన్టీ రామారావు జీవితంలోని చిరిగిపోయిన లేదా చింపివేయబడ్డ పేజీలను తన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో చూపిస్తానని దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని ఎన్టీఆర్ సతీమణి, వైకాపా మహిళా నేత లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు.

ఆయన తీయదలచిన సినిమా స్క్రిప్టు గురించి తనను ఇంతవరకూ సంప్రదించలేదని, ఆయన వచ్చి, స్క్రిప్టు గురించి చెబితే వింటానని, ఏవైనా విశేషాలు చెప్పమన్నా చెబుతానని అన్నారు. తనకు ఆ కథ నచ్చితే ఆయనకు అనుమతినిస్తానని అన్నారు. ఈ సినిమా అభిమానులను అలరించేదిగా, ఎన్టీఆర్ జీవితంలో మరుగునపడిన ఓ సరికొత్త కోణాన్ని బయటకు తెస్తుందని భావిస్తున్నానని తెలిపారు.

ram gopal varma
lakshmi's ntr
lakshmi parvati
  • Loading...

More Telugu News