మెగాస్టార్: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం: రష్మీ
- ‘ఘరానా మొగుడు’ లోని పాట అంటే ఇష్టం
- ‘ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్లు...’ చాలా బాగుంటుంది
- పాత పాటలు అద్భుతంగా ఉంటాయి
- ఓ ఇంటర్వ్యూలో రష్మీ
మెగాస్టార్ చిరంజీవి నటించిన నాటి చిత్రం ‘ఘరానా మొగుడు’ లోని ఓ పాట తనకు చాలా ఇష్టమని ప్రముఖ సినీ నటి, యాంకర్ రష్మీ చెప్పింది. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పాత చిత్రాల్లో మీకు ఏ సినిమాలో పాట అంటే ఇష్టం?’ అని అడగగా, ‘ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్లు...’ అనే పాట తనకు చాలా ఇష్టమని చెప్పిన రష్మీ, ఆ పాటను పాడుతూ నవ్వులు చిందించింది. పాత పాటలు అద్భుతంగా ఉంటాయని చెప్పింది. తాను ఇప్పటికీ పిల్లల్లా ‘పొకెమాన్’ ఆడుతుంటానని, ఆ గేమ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.