siva balaji: తనను అసభ్య పదజాలంతో వేధిస్తున్న వారిపై స్పందించిన నటి మధుమిత

  • వారిది పైశాచికానందం 
  • మహిళలను వేధించే ఆకతాయిలు ఎందరో
  • బుద్ధి చెప్పాలనే పోలీసులకు ఫిర్యాదు

తన భార్య మధుమిత సెల్ ఫోన్ కు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అసభ్య పదజాలంతో కూడిన మెసేజ్ లను పంపిస్తున్నారని నటుడు శివబాలాజీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో ఉన్న ఓ వీడియో లింక్‌ పై అభ్యంతరకంగా, ఆశ్లీలతతో నిండిన మెసేజ్ లు కూడా పెడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశాడు. ఇక ఈ ఫిర్యాదులపై మధుమిత స్పందిస్తూ, ఆకతాయిలు చాలా మంది మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని, వారికి తాను కూడా టార్గెట్ గా మారానని చెప్పింది.

వాళ్ల పైశాచిక ఆనందం కోసం మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారని, వాళ్లకు బుద్ధి చెప్పాలన్న ఆలోచనతోనే, పోలీసులను ఆశ్రయించామని తెలిపింది. కేవలం పరాయి వాళ్లే కాకుండా సొంత వాళ్ల నుంచి కూడా వేధింపులు కొంతమందికి ఎదురవుతున్నాయని, వారంతా లోలోపలే కుమిలిపోతున్నారని, వారికి మనో ధైర్యాన్ని కల్పించడమే తన ఉద్దేశమని చెప్పింది. పోలీసులు ఈ విషయంలో సానుకూలంగా స్పందించారని, నిందితులకు తగిన శిక్ష పడుతుందన్న నమ్మకం ఉందని చెప్పింది.

siva balaji
madhumita
  • Loading...

More Telugu News