tamil nadu politics: మన 'ప్రధాని మన్మోహన్ సింగ్' అట.. తమిళనాడు మంత్రి గారి నోట ఆ మాట వినండి!

  • తన తెలివితేటలతో నెట్టింట వైరల్ అయిన మంత్రి శ్రీనివాసన్
  • పన్నీర్ సెల్వంకు అభివృద్ధే లక్ష్యమని వ్యాఖ్య
  • అభివృద్ధి కోసం ప్రధాని మన్మోహన్ ను కలిసి వచ్చారన్న అటవీ మంత్రి
  • సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఒకటే కామెంట్లు!

ఓ తమిళ మంత్రి తనలోని తెలివితేటలను బయటపెట్టిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిండిగల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి శ్రీనివాసన్ మాట్లాడుతూ, పన్నీర్ సెల్వం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మన్మోహన్ సింగ్ తో చర్చించి వచ్చారని వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు.

"రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ఢిల్లీ వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధాని మన్మోహన్ సింగ్ తో చర్చలు జరిపి వచ్చారు" అన్న ఆయన మాటలు వైరల్ కాగా, నెటిజన్లు విమర్శల వర్షం కురిపించేస్తున్నారు. కాగా, ఈ నెల 12న పన్నీర్ కొందరు మంత్రులు, అన్నాడీఎంకే నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లి మోదీని కలిసొచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అంటు వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, రోడ్ల విస్తరణ తదితర అభివృద్ధి సంబంధిత అంశాలపై మాత్రమే చర్చించామని నాడు పన్నీర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే పర్యటనను ప్రస్తావిస్తూ, మోదీ స్థానంలో మన్మోహన్ ను చేర్చిన శ్రీనివాసన్ ప్రసంగం వీడియోను మీరూ చూడవచ్చు.

tamil nadu politics
panneer selvam
srinivasan
manmohan singh
  • Error fetching data: Network response was not ok

More Telugu News