కాన్పూర్: మూడో వన్డే: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
- కాన్పూర్ వేదికగా మూడో వన్డే
- రెండు జట్లకు కీలకం కానున్న మ్యాచ్
- ఆసక్తిగా వీక్షిస్తున్న అభిమానులు
కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో కివీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డే మ్యాచ్ ల్లో చెరొకటి గెలుచుకున్న భారత్, న్యూజిలాండ్ జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. న్యూజిలాండ్ బౌలర్ సౌథీ వేసిన బంతితో మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బ్యాటింగ్ కు దిగారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుకే ఈ సిరీస్ దక్కనుండటంతో అభిమానులు మరింత ఆసక్తిగా తిలకిస్తున్నారు.