: భారత్ అమ్ములపొదిలో 'బ్లాక్ పాంథర్స్'


భారత నేవీని మరింత పరిపుష్టం చేయాలని కేంద్రం సంకల్పించింది. తాజాగా మిగ్-29 కె యుద్ధవిమానాలతో ఐఎన్ఎస్ 303 బ్లాక్ పాంథర్స్ స్క్వాడ్రన్ ఏర్పాటు చేసింది. ఈ శత్రుభీకర విమానాలను ఈనెల 11న లాంఛనంగా నేవీలో ప్రవేశపెట్టనున్నారు. పనాజిలోని ఐఎన్ఎస్ హన్సాలో జరిగే ఓ అధికారిక కార్యక్రమంలో ఈ సరికొత్త స్క్వాడ్రన్ ను జాతికి అంకితం చేస్తారు.

బహుళ ప్రయోజనకారిగా పేరుగాంచిన ఈ మిగ్-29కె పోరాట విహంగాన్ని రవాణా విమానంగానూ ఉపయోగించవచ్చు. ఈ విమానం యాంటి ఎయిర్ క్రాఫ్ట్, యాంటి షిప్ మిస్సైళ్ళను కలిగి ఉంటుంది. ఈ రష్యా తయారీ విమానం యొక్క అద్వితీయ సామర్థ్యం దృష్ట్యా సముద్ర జలాలపై భారత నేవీ మరింత శక్తిమంతం అవుతుందని భారత రక్షణ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

  • Loading...

More Telugu News