revant reddy: హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన కుంతియా... రేవంత్ కోసమే!

  • మధ్యాహ్నం 12 గంటలకు రానున్న కుంతియా
  • ఆపై రేవంత్ రెడ్డితో భేటీ
  • ఢిల్లీకి స్వయంగా తీసుకుపోనున్న కుంతియా

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా ఈ ఉదయం హైదరాబాద్ బయలుదేరారు. మధ్యాహ్నం 12 గంటలకెల్లా ఆయన హైదరాబాద్ చేరుకుంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రేవంత్ రెడ్డితో మాట్లాడి, ఢిల్లీలో కార్యక్రమాల వివరాలను వెల్లడించేందుకే కుంతియా స్వయంగా రాష్ట్రానికి వస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ప్రస్తుతం కొడంగల్ లో కార్యకర్తలతో సమావేశమైన రేవంత్ రెడ్డి, అది ముగియగానే మధ్యాహ్నం హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చి, కుంతియాను కలిసి, తిరిగి సాయంత్రం కొడంగల్ కు చేరుకుని రాత్రికి కార్యకర్తలతో సమావేశాలు కొనసాగిస్తారని తెలుస్తోంది. కుంతియాతో పాటు కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా రేవంత్ ను కలుస్తారని సమాచారం. ఇక రేపటివరకూ ఇక్కడే ఉండే కుంతియా, రేవంత్ ను తీసుకుని ఢిల్లీకి వెళతారని తెలుస్తోంది.

revant reddy
congress
kuntia
  • Error fetching data: Network response was not ok

More Telugu News