hardhi: ఇక మీరే తేల్చుకోండి... కాంగ్రెస్ కు డెడ్ లైన్ పెట్టిన హార్దిక్ పటేల్!

  • మద్దతు కావాలంటే రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
  • 3వ తేదీలోగా నిర్ణయం తీసుకోండి
  • లేకుంటే అమిత్ షాకు పట్టిన గతే
  • కాంగ్రెస్ కు హార్దిక్ పటేల్ హెచ్చరిక

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన మద్దతు కావాలంటే, తక్షణమే పటీదార్ వర్గానికి రిజర్వేషన్లను కల్పిస్తామని ఆ పార్టీ హామీ ఇవ్వాలని యువనేత హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని, కాంగ్రెస్ గెలవాలంటే, పటీదార్ అనామత్ ఆందోళన్ సంఘ్ మద్దతు తప్పనిసరని అభిప్రాయపడ్డ హార్దిక్, బంతిని కాంగ్రెస్ కోర్టులోకి నెడుతూ, తన వర్గానికి విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

అధికారంలోకి రాగానే రిజర్వేషన్లపై జీవో విడుదల చేస్తామని హామీ ఇస్తే మద్దతిచ్చేందుకు సిద్ధమని, ఏ విషయాన్ని రాహుల్ గాంధీ మలి విడత గుజరాత్ పర్యటనకు వచ్చే లోపు చెప్పాలని ఆయన అన్నారు. కాగా, 3వ తేదీన రాహుల్ గాంధీ గుజరాత్ ప్రచారానికి వెళ్లనున్నారు. నవంబర్ 3లోగా పటీదార్ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఓ స్పష్టమైన అభిప్రాయానికి రాకపోతే, సూరత్ ర్యాలీలో అమిత్ షా ఎదుర్కొన్న పరిస్థితులనే ఎదుర్కోవాల్సి వుంటుందని పటేల్ హెచ్చరించారు.

కాగా, సూరత్ లో గత నెలలో పటీదార్ కమ్యూనిటీ నేతలతో కలసి ఆమిత్ షా ఓ సమావేశాన్ని నిర్వహించగా, హార్దిక్ అనుచరులు నానా హంగామా చేసి ఫర్నీచర్ ను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News