Theft: దొంగతనం కేసులో కటకటాల వెనక్కి ‘ఇండియన్ ఐడల్’!

  • తైక్వాండో క్రీడలో బంగారు పతకాలు సాధించిన నిందితుడు
  • దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు
  • మీడియా ఎదుట నిందితుడితో పాటపాడించుకున్న పోలీసులు

ఓ దొంగతనం కేసులో తైక్వాండో క్రీడాకారుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. దీపక్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా కొందరు వారిని అడ్డగించారు. వారిపై మిర్చి స్ప్రే చల్లి పర్సు, బంగారు గొలుసు, ఫోన్లు, ఏటీఎం కార్డులు దొంగిలించారు. వారిని  కిందికి దింపి వాహనాన్ని కూడా ఎత్తుకెళ్లారు.

దీపక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, తైక్వాండో క్రీడాకారుడు అయిన సూరజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తైక్వాండోలో సూరజ్ రెండు బంగారు పతకాలు కూడా సాధించడం విశేషం. అలాగే ఓ టీవీ చానల్ నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఐడల్’ రియాలిటీ షోలోనూ పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు. సూరజ్‌తో పాటు అతడి స్నేహితులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం పోలీసులు సూరజ్‌తో చక్కని పాట పాడించుకోవడం కొసమెరుపు! 

  • Loading...

More Telugu News