ఫ్రెంచ్ ఓపెన్: ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ కు కిడాంబి శ్రీకాంత్!
- సెమీస్ లో సహచరుల మధ్య జరిగిన పోరులో కిడాంబి విజయం
- శ్రీకాంత్ కు గట్టి పోటీ ఇచ్చిన ప్రణయ్
- ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన సెమీస్
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీస్ లో ప్రణయ్ పై కిడాంబి శ్రీకాంత్ విజయం సాధించాడు. సహచరుల మధ్య జరిగిన ఈ పోటీలో 14-21, 21-19, 21-18 తేడాతో ప్రణయ్ ను శ్రీకాంత్ ఓడించాడు. ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో తొలి గేమ్ లో శ్రీకాంత్ కొంచెం వెనుకబడ్డాడు. రెండు, మూడు గేమ్ లలో వాళ్లిద్దరూ హోరాహోరీగా తలపడినప్పటికీ శ్రీకాంత్ విజయం సాధించాడు. కాగా, ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీస్ లో షట్లర్ సింధు ఓటమిపాలైంది. జపాన్ క్రీడాకారిణి యమగుచి చేతిలో సింధు ఓడిపోయింది.