‘జై సింహా’: ‘జై సింహా’ సూపర్ హిట్ అవడం ఖాయం: నిర్మాత సి. కల్యాణ్

  • భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం
  • వైజాగ్ బీచ్ రోడ్ లో ‘మహాధర్నా’ సీక్వెన్స్ షూటింగ్
  • మీడియాతో మాట్లాడిన సి.కల్యాణ్

బాలకృష్ణ కెరీర్ లో ‘సింహా’ అనే టైటిల్స్ తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయని, అదే విధంగా ‘జై సింహా’ సినిమా కూడా విజయం సాధిస్తుందని ఈ చిత్ర నిర్మాత సి. కళ్యాణ్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారీ బడ్జెట్ తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్ లో 5 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో ‘మహాధర్నా’ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతున్నట్టు చెప్పారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102వ చిత్రాన్ని తాను నిర్మిస్తుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. 

  • Loading...

More Telugu News