వైసీపీ: నాడు ఎన్టీఆర్ ని చంద్రబాబు, యనమల వెన్నుపోటు పొడిచారు: వైసీపీ నేత జోగి రమేష్

  • చంద్రబాబు, యనమలపై మండిపడ్డ జోగి రమేష్
  • యనమల నోటిని ఫినాయిల్ తో శుభ్రం చేసుకోవాలి
  • నాడు చంద్రబాబు దిగజారుడు రాజకీయాల వల్లే అసెంబ్లీకీ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు

నాడు ఎన్టీఆర్ ను వెనుక నుంచి చంద్రబాబు, ముందు నుంచి యనమల రామకృష్ణుడు వెన్నుపోటు పొడిచారని వైసీపీ నేత జోగి రమేష్ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, యనమల నోటిని ఫినాయిల్ తో శుభ్రం చేసుకోవాలని, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా వ్యవహరించిన ఆయన ఆ పదవికే మచ్చ తెచ్చారని విమర్శలు గుప్పించారు. ఆనాడు చంద్రబాబు దిగజారుడు రాజకీయాల కారణంగా అసెంబ్లీకి ఎన్టీఆర్ దూరంగా ఉన్నారని, ఆ బాటలోనే నేడు తాము పయనిస్తామని, అనైతిక రాజకీయాలకు వ్యతిరేకంగా నడుస్తామని చెప్పామని జోగి రమేష్ అన్నారు.

  • Loading...

More Telugu News