సోనియా గాంధీ: కోలుకున్న సోనియా.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్!
- ఈరోజు సాయంత్రం ఇంటికి చేరిన సోనియా
- నిలకడగా ఆమె ఆరోగ్యం
- విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించిన వైద్యులు
నిన్న అస్వస్థతకు గురైన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కోలుకున్నారు. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమెను ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించినట్టు ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, నిన్న హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉండగా ఆమె కడుపునొప్పికి గురయ్యారు. వెంటనే, ఎయిర్ లిఫ్ట్ లో ఆమెను ఢిల్లీ ఆసుపత్రికి తరలించడం జరిగింది.