kim jong un: అమెరికా వీధుల్లో కిమ్ జాంగ్ ఉన్ ను పోలిన వ్యక్తి.. ఈ వీడియో చూడండి!

  • ఆశ్చ‌ర్య‌పోయిన అమెరికా జ‌నాలు
  • కెమెరాల్లో బంధించ‌డానికి ప్ర‌య‌త్నం
  • ర‌క్ష‌ణ కోసం ప‌క్క‌నే పోలీసును పెట్టుకున్న కిమ్ లాంటి వ్య‌క్తి

అమెరికా మీద ఎప్పుడెప్పుడు అణుబాంబు వేద్దామా అని ఎదురుచూస్తున్న ఉత్త‌ర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను పోలిన ఓ వ్యక్తి హఠాత్తుగా న్యూయార్క్ వీధుల్లో దర్శనమిచ్చాడు. అచ్చం కిమ్ లాగే ఉన్న ఆ వ్య‌క్తి దాదాపు 10 గంటల పాటు న్యూయార్క్ వీధుల్లో న‌డిచి సంద‌డి చేశాడు. కిమ్‌లాగే దుస్తులు ధరించి, ఆయన బాడీ లాంగ్వేజ్ ని అనుకరిస్తూ, అలాంటి హావభావాలు పలికిస్తూ వీధుల్లో ఠీవీగా నడిచాడు.

చాలామంది పౌరులు అతనిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. మరి కొందరికైతే అమెరికాలో ఏం జరుగుతుందోనని అయోమయానికి గురయ్యారు. కిమ్‌లాగా ఉన్న వ్యక్తిని చూసిన ఇంకొంతమంది తమ కెమెరాల్లో బంధించడానికి ఉత్సాహం చూపారు. తనపై ఎవ‌రైనా దాడి చేస్తారేమోన‌ని ర‌క్ష‌ణ కోసం ఒక పోలీసు అధికారిని కూడా పెట్టుకున్నాడు.

అలా నడుచుకుంటూ నేరుగా ట్రంప్‌ టవర్‌లోనికి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి వీధుల్లో నడుస్తున్న ఆరు నిమిషాల వ్యవధి ఉన్న వీడియో ఒకదానిని క్యూపార్క్‌ పోస్ట్‌ చేయగా నిమిషాల వ్యవధిలోనే దాదాపు 9 లక్షల మంది దానిని వీక్షించారు.
 

kim jong un
north korea
prank video
new york
look a like
  • Error fetching data: Network response was not ok

More Telugu News