nama nageswara rao: నామా నాగేశ్వరరావు నిజస్వరూపమిదే.. ప్రశ్నిస్తే బ్లాక్ మెయిలర్ అని ముద్ర వేస్తాడు!: బాధిత మహిళ సుజాత

  • నామా నాగేశ్వరరావు ఆడాళ్లతో అసభ్యంగా వ్యవహరిస్తాడు
  • ఎదురుతిరిగి ప్రశ్నిస్తే వాళ్లపై బ్లాక్ మెయిలర్ అని ముద్రవేస్తాడు
  • 2013 నుంచి తన ఇంటికి వచ్చే నామా.. తానెవరో తెలియదని, బ్లాక్ మెయిలర్ అని ఆరోపిస్తున్నాడు

'టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు... ఇది తప్పు అని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బ్లాక్ మెయిలర్ అని ముద్ర వేస్తాడ'ని ఆయనపై ఫిర్యాదు చేసిన బాధితురాలు సుజాత మండిపడ్డారు. ఓ టీవీ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, నిర్మలా వెంకటేశ్ అనే మహిళతో తనకు లివింగ్ రిలేషన్ ఉందని నామా నాగేశ్వరరావే తనకు చెప్పారని అన్నారు. దానిపై నిలదీయడంతో తనపై కోపం పెంచుకున్నారని ఆమె చెప్పారు. 2013 నుంచి తన ఇంటికి వస్తున్నాడని ఆమె తెలిపారు. ఇద్దరం 'నువ్వు, నువ్వు' అని సంబోధించుకునే సాన్నిహిత్యమున్న నామా నాగేశ్వరరావు, ఇప్పుడు తానెవరో తెలియదని, తాను బ్లాక్ మెయిలర్ అంటూ కామన్ ప్రెండ్స్ వద్ద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు.

 తన నగ్న చిత్రాలు ఉన్నాయని పదేపదే మాట్లాడుతున్నాడని, అలా అనడంలో ఆయన ఉద్దేశ్యం ఏంటని ఆమె నిలదీశారు. గత 8 నెలలుగా రౌడీ షీటర్ తో ఫోన్ చేయించి వేధింపులకు దిగుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మోత్కుపల్లి నర్సింహులుతో ఫోన్ చేయించి, కేసు విత్ డ్రా చేసుకుంటానని ఒక్క వాక్యం మెయిల్ పెట్టమన్నాడని, మెయిల్ పెట్టిన తరవాత  ఫోన్ చేయమని చెప్పడంతో  తాను ఫోన్ చేస్తే, మాట్లాడే అవసరం లేదన్నాడని ఆమె అన్నారు. అతని నిజస్వరూపంపై చంద్రబాబునాయుడు పీఏకి కూడా వాట్సాప్ ద్వారా  చాలాసార్లు తెలియచేశానని ఆమె తెలిపారు. నామా నాగేశ్వరరావును ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బ్లాక్ మెయిలర్ అనే ముద్ర వేస్తాడని ఆమె తెలిపారు. 

nama nageswara rao
sujatha ramakrishnan
controversy
  • Loading...

More Telugu News