నామా నాగేశ్వరరావు: మ‌హిళ చేసిన ఫిర్యాదుతో నామా నాగేశ్వరరావుపై పోలీసు కేసు న‌మోదు

  • న‌గ్న చిత్రాల‌ను బయటపెడతానంటూ బెదిరిస్తున్నారని ఓ మహిళ ఫిర్యాదు
  • ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు
  • న్యాయస్థానం ఆదేశంతో నామా నాగేశ్వరరావు, ఆయ‌న త‌మ్ముడిపై కూడా కేసు నమోదు

న‌గ్న చిత్రాల‌ను బయటపెడతానంటూ తనను బెదిరిస్తున్నారని ఓ మహిళ చేసిన‌ ఫిర్యాదు మేర‌కు టీడీపీ మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావుపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మ‌హిళ ఈ విష‌యంపై కొన్ని రోజుల ముందే పోలీసులను ఆశ్ర‌యించ‌గా పోలీసులు ఆమె చేసిన ఫిర్యాదును ప‌ట్టించుకోలేద‌ని తెలుస్తోంది.

చివ‌ర‌కు ఆమె కోర్టును ఆశ్రయించడంతో నిందితుల‌పై కేసు న‌మోదు చేయాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది. దీంతో ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డ ఆరోప‌ణ‌ల‌తో నామా నాగేశ్వరరావు, ఆయ‌న త‌మ్ముడు నామా సీతయ్యలపై కేసు నమోదు చేశారు. వారిపై ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన‌ట్లు పోలీసులు చెప్పారు.  

  • Loading...

More Telugu News