jaganmohan reddy: నేడు లండన్‌కు జగన్.. కోర్టు అనుమతి.. ఎన్నారై విభాగాలను కలవనున్న వైసీపీ చీఫ్!

  • కుమార్తెను చూసి వచ్చేందుకు అనుమతిచ్చిన కోర్టు
  • ఆరు రోజులపాటు పర్యటన
  • నవంబరు 2న తిరిగి హైదరాబాద్‌కు

లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తెను చూసేందుకు అనుమతివ్వాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పెట్టుకున్న పిటిషన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో జగన్ వారం రోజులపాటు లండన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జగన్ తన కుమార్తెను కలవడంతోపాటు పార్టీ కోసం నిధులు కూడా సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

విచారణ నిమిత్తం ఇటీవల కోర్టుకు హాజరైన జగన్మోహన్‌రెడ్డి లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నేటి (శనివారం) నుంచి ఆరు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా పార్టీ ఎన్ఆర్ఐ విభాగాలను కలుసుకుంటారని సమాచారం. నవంబరు 2న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న జగన్ ఆరో తేదీ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.

jaganmohan reddy
YSRCP
london
tour
  • Loading...

More Telugu News