dawood ibrahim: దావూద్ ఎప్పటికీ రాడు... రావాలనుకుంటే శవమైపోతాడు: మాజీ పోలీస్ బాస్ సంచలన వ్యాఖ్య

  • ఐఎస్ఐ అధీనంలో ఉన్న దావూద్
  • ఇండియాకు వెళ్లాలని అనుకున్నా చనిపోతాడు
  • ఐఎస్ఐ చంపేస్తుందన్న ఎంఎన్ సింగ్

ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, తన జీవితంలో ఇండియాకు తిరిగి వచ్చే అవకాశాలు లేవని ముంబై మాజీ పోలీసు బాస్ ఎంఎన్ సింగ్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం దావూద్ పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అధీనంలో ఉన్నాడని, ఏదైనా పరిస్థితుల్లో దావూద్, ఇండియాకు వెళదామని అనుకున్నా కూడా, ఐఎస్ఐ అతడిని హతమారుస్తుందని చెప్పారు.

దావూద్ ఇబ్రహీం పేరు చెబితే ముంబై ప్రజలు భయపడే రోజులు పోయాయని అన్నారు. దావూద్ ఇండియాకు వస్తాడన్న ఆలోచన కూడా వద్దని అన్నారు. కాగా, ముంబై క్రైమ్ బ్రాంచ్ సంయుక్త కమిషనర్ గా, 1993 నాటి పేలుళ్ల ఘటన తరువాత ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్ గా, నగర పోలీసు కమిషనర్ గా ఎంఎన్ సింగ్ పని చేశారు. పేలుళ్ల దర్యాప్తు సమయంలో కొందరు పోలీసు ఉన్నతాధికారులకు దావూద్ తో సంబంధాలు ఉన్నాయన్న విషయం బయట పడగా, వారిని సింగ్ డిస్మిస్ చేసి వార్తల్లో నిలిచారు.

dawood ibrahim
dawood return to india
MN singh
  • Loading...

More Telugu News