kcr: తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగ సారాంశం!

  • ప్రశ్నోత్తరాల సమయంలో కేసీఆర్ స్పందన
  • ఎమ్మెల్యేల ప్రశ్నలకు సీఎం సమాధానాలు
  • రాష్ట్రంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదన్న కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వాటి సారాంశం ఇదే...
  • తెలంగాణలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వం
  • హోంగార్డుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం
  • హోంగార్డులను క్రమబద్ధీకరించే విషయంలో న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి
  • సిబ్బంది క్రమబద్ధీకరణలో రూల్ రిజర్వేషన్ పాటిస్తాం
  • పర్మినెంట్ ఉద్యోగాల కోసమే ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేశాం
  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకోవాల్సి వస్తే... మూడు నెలల కాలపరిమితితోనే తీసుకుంటాం
  • కాంట్రాక్ట్ ఉద్యోగాలను ప్రవేశపెట్టినవారే రెగ్యులరైజేషన్ ను అడ్డుకుంటున్నారు
  • ఎస్పీ, ఎస్టీ, మైనార్టీలకు అన్యాయం జరగనివ్వం
  • మసీదుల్లోని ఇమాం, మౌజంలకు గౌరవవేతనం పెంచుతాం
  • ఉద్యోగాల కల్పన విషయంలో ప్రజలు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలి
  • ప్రభుత్వ ఉద్యోగాలను అందరికీ కల్పించడం సాధ్యం కాదు
  • ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం
  • ఉద్యోగాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కొంతమంది అభాసుపాలు చేస్తున్నారు
  • అర్ధాకలితో ఎవరూ పని చేయకూడదని టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


  • Loading...

More Telugu News