revanth reddy: అసెంబ్లీకి ఒంటరిగానే హాజరైన రేవంత్ రెడ్డి!

  • సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చిన రేవంత్
  • రేవంత్ కంటే ముందే అసెంబ్లీలోకి వెళ్లిపోయిన సండ్ర
  • రేవంత్ పదవులను తొలగించిన పార్టీ నాయకత్వం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఒంటరిగానే హాజరయ్యారు. మరో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముందుగానే అసెంబ్లీలోకి వెళ్లిపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్, ఎల్పీ నేత పదవులను తొలగించడంతో... ప్రస్తుతం రేవంత్ రెడ్డి సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పార్టీ నాయకత్వం ఆయనపై ఈ మేరకు చర్యలు తీసుకుంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద రేవంత్ మాట్లాడుతూ, డ్రగ్స్ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపట్ల మండిపడ్డారు.

revanth reddy
tTelugudesam
telangana assembly sessions
  • Loading...

More Telugu News