telangana assembly sessions: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ.. తీవ్ర గందరగోళం!

  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
  • రైతులను ఆదుకోవాలంటూ బీజేపీ వాయిదా తీర్మానం
  • ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామన్న డిప్యూటీ స్పీకర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అందరూ ఊహించినట్టుగానే ప్రారంభమైన కొద్ది సేపటికే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలని, అక్రమ అరెస్టులను ఆపాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, రైతులను ఆదుకోవాలంటూ బీజేపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

ఈ సందర్భంగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోందని... దీని తర్వాత వాయిదా తీర్మానం చేపడదామని సభ్యులకు సూచించారు. అయినా విపక్ష సభ్యులు వాయిదా తీర్మానం చేపట్టాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల మధ్యే అధికారపక్ష సభ్యుల ప్రసంగాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కూడా విపక్షసభ్యులు తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు.

telangana assembly sessions
telangana assembly
congress
TRS
bjp
  • Loading...

More Telugu News