Flipkart: శాంసంగ్ గెలాక్సీ ఎస్7పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్.. రూ.16 వేల తగ్గింపు

  • అసలు ధరలో 34 శాతం రాయితీ
  • ఎక్చేంజ్ ఆఫర్‌తో కలుపుకుంటే రూ.5 వేలకే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7
  • సీజన్ లూట్ సేల్‌లో భాగంగా భారీ తగ్గింపు

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 మొబైల్‌పై ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. సీజన్ లూట్‌ సేల్‌లో భాగంగా ఈ ఆఫర్‌ను తెరపైకి తీసుకొచ్చింది. దసరా, దీపావళి పండుగ సీజన్‌లో భారీ రాయితీలతో వినియోగదారులను ఆకర్షించిన ఈ-కామర్స్ సంస్థలు ఇప్పుడు తమ వద్ద ఉన్న పాత స్టాక్‌ను వదిలించుకునే పనిలో పడ్డాయి. కొత్త స్టాక్ రావడానికి ముందే తమ వద్ద ఉన్న ఉత్పత్తులను విక్రయించాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా భారీ రాయితీలు ఆఫర్ చేస్తూ మరోసారి వినియోగదారులను తమవైపు తిప్పుకుంటున్నాయి.

ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ, షియోమీ, రెడ్‌మీ, మోటో, వైబ్ తదితర ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లు ప్రకటించింది. గతేడాది విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7ను ఆఫర్‌లో భాగంగా రూ.29,990కే విక్రయిస్తోంది. దీని అసలు ధర రూ.46 వేలు కాగా, రూ.16,010 (34 శాతం) రాయితీ ప్రకటించింది. ఈ ఫోన్ విడుదలై ఏడాదే కావడంతో ఈ డీల్ బాగానే ఉందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్7లో గొప్ప ఫీచర్లు ఉన్నాయి. క్వాడ్ హెచ్‌డీ స్క్రీన్, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ చార్జింగ్, గొప్ప పనితీరు ఈ ఫోన్ సొంతం. కాగా, ఈ ఫోన్‌పై 34 శాతం రాయితీ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ రూ. 25 వేలతో ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. అంటే రూ.16 వేల రాయితీ, రూ.25 వేల ఎక్చేంజ్ కలుపుకుంటే మొత్తంగా ఈ ఫోన్‌ను రూ.4,990కే దక్కించుకోవచ్చన్నమాట.

Flipkart
Loot sale
Samsung Galaxy
discount
  • Error fetching data: Network response was not ok

More Telugu News