imd: ఇస్రోపై మండిపడ్డ భారత వాతావరణ శాఖ!

  • అసంపూర్ణమైన వాతావరణ అంచనాలను అందిస్తోంది
  • ఏపీ ప్రభుత్వానికి నేరుగా సమాచారాన్ని ఇస్తోంది
  • సమాచారాన్ని మాకు ఇస్తే... సరైన అంచనాలను వెల్లడిస్తాం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోపై భారత వాతావరణ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము చేయాల్సిన పనిని ఇస్రో చేస్తోందని... ఇదే సమయంలో అసంపూర్ణమైన వాతావరణ అంచనాలను అందిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడింది. సరైన సమాచారం లేకుండానే తుపానులు వస్తాయని ఇస్రో చెప్పడం ఎంతవరకు సబబని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ ప్రశ్నించారు.

 ఏపీ ప్రభుత్వానికి ఇస్రో నేరుగా వాతావరణ సమాచారాన్ని పంపుతోందని మండిపడ్డారు. అదే సమాచారాన్ని మాకు పంపిస్తే... సరిగ్గా అంచనా వేసి, మెరుగైన అంచనాలను వెల్లడిస్తామని చెప్పారు. సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించడం తమ పని అని అన్నారు. నవంబర్ లో మూడు తుపాన్లు వస్తాయంటూ ఇస్రో చేసిన ప్రకటనను వాతావరణ శాఖ తప్పుబట్టింది.

  • Loading...

More Telugu News