పీవీపీ: ప్రముఖ నిర్మాత పీవీపీకి పితృవియోగం
- పీవీపీ తండ్రి రాఘవేంద్రరావు (81) మృతి
- పలువురు ప్రముఖుల సంతాపం
- విజయవాడలో రేపు అంత్యక్రియలు
ప్రముఖ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త ప్రసాద్ వి.పొట్లూరి (పీవీపీ) తండ్రి రాఘవేంద్రరావు (81) ఈరోజు మృతి చెందారు. నిన్న ఉదయం ఆయన అనారోగ్యానికి గురవడంతో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. రేపు ఉదయం విజయవాడలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం. కాగా, పీవీపీ తండ్రి మృతి వార్తపై సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు సంతాపం తెలిపారు.