Richa Chadda: ఇమేజ్ కోసం క్రికెటర్లు, నటులతో డేటింగ్ చేయమని సలహా ఇచ్చారు... బాలీవుడ్ నటి రిచా చద్దా సంచలన వ్యాఖ్యలు!

  • డేటింగ్‌కు నిరాకరించడం వల్లే తనకు స్నేహితులు తక్కువన్న బ్యూటీ
  • ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తవారికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయని వ్యాఖ్య
  • ‘గంగాస్ ఆఫ్ వాసేయ్‌పూర్’ చిత్రంలో నటనకు ప్రశంసలు

బాలీవుడ్ ప్రముఖ నటి రిచా చద్దా (32) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పేరు ప్రఖ్యాతుల కోసం సూపర్ స్టార్లు, క్రికెటర్లతో సంబంధాలు పెట్టుకోవాలని ఒకరు సూచించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే అందుకు తాను అంగీకరించలేదని తెలిపింది. ‘‘నేను ఇండస్ట్రీలో అడుపెట్టాక పర్సనల్ అసిస్టెంట్ ఒకరు ఫలానా నటుడికి టెక్ట్స్ మెసేజ్ పంపించాలని చెప్పాడు. అతడితో డేటింగ్ చేయమని కోరాడు. అతడికి పెళ్లయింది కదా? అని ప్రశ్నిస్తే అప్పుడతడు ఓ క్రికెటర్ పేరు చెప్పి అతడికి  మెసేజ్ ఎందుకు పంపించకూడదు? అని ఎదురు ప్రశ్నించాడు. మీ పబ్లిక్ ఇమేజ్‌కు, పబ్లిక్ రిలేషన్స్‌కు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది’’ అని అతడు తనకు సలహా ఇచ్చాడని వివరించింది.

అయితే తానెప్పుడూ డేటింగ్ జోలికి వెళ్లలేదని పేర్కొంది. బయట నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చిన వారికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయని చెప్పింది. తనకు ఇటువంటివి ఇష్టం లేకపోవడం వల్లే ఇండస్ట్రీలో చాలా తక్కువమంది స్నేహితులు ఉన్నారని వివరించింది. ఇండస్ట్రీలో అందరితో సంబంధాలు ఉండాలని, కానీ అవి ఈ తరహా మాత్రం కాకూడదని పేర్కొంది.

ప్రముఖ దర్శకనిర్మాత దివాకర్ బెనర్జీ తెరకెక్కించిన ‘ఓయ్ లక్కీ లక్కీ ఓయ్’ సినిమాతో రిచా చద్దా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అనురాగ్ కశ్యప్ చిత్రం ‘గంగాస్ ఆఫ్ వాసేయ్‌పూర్’ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఆమె నటించిన ‘జియా ఔర్ జియా’ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Richa Chadda
Bollywood
dating
  • Loading...

More Telugu News