messi: కటకటాల వెనుక లియోనెల్ మెస్సీ రక్తకన్నీరు... ఫొటోలతో బెదిరిస్తున్న ఐఎస్ఐఎస్... చూడండి!

  • రక్తపాతం జరిపిస్తాం
  • భారీ ఎత్తన ప్రాణనష్టం తప్పదు
  • ఓటమెరుగని దేశం మాది
  • రష్యాను హెచ్చరించిన ఐఎస్ఐఎస్

వచ్చే సంవత్సరం రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీల్లో రక్తపాతం సృష్టిస్తామని ఐఎస్ఐఎస్ హెచ్చరికలు జారీ చేసింది. టోర్నీ జరిగే సమయంలో విధ్వంసం సృష్టిస్తామని, భారీ ఎత్తున ప్రాణనష్టం కలుగుతుందని హెచ్చరించింది. అర్జెంటీనా కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ, కటకటాల వెనుక నిలబడి కర్త కన్నీరు కారుస్తున్నట్టు తయారు చేసిన ఓ చిత్రాన్ని విడుదల చేసింది.

 ఈ చిత్రం కింద 'డిక్షనరీలో ఓటమి అనే పదాన్నే ఎరుగని దేశంతో మీరు పోరాడుతున్నారు' అని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదులు నిర్వహిస్తున్న వాఫా మీడియా ఫౌండేషన్ దీన్ని ఆన్ లైన్ లో ఉంచింది. నిన్న లండన్ లో ఫీఫా అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరుగగా, ఆపై కొద్ది గంటల వ్యవధిలోనే ఈ చిత్రం ప్రత్యక్షం కావడం గమనార్హం.

messi
isis
fifa
football
  • Loading...

More Telugu News