క్రికెట్: పూణే వన్డే అప్ డేట్స్: దినేష్ కార్తీక్ అర్ధ శతకం!
- ప్రస్తుతం టీమిండియా స్కోరు 43 ఓవర్లకి 215 పరుగులు
- క్రీజులో కార్తీక్ (60), ధోనీ (6)
పూణేలో జరుగుతోన్న భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం క్రీజులో కార్తీక్ 60, ధోనీ 6 పరుగులతో ఉన్నారు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ 7, కెప్టెన్ విరాట్ కోహ్లీ 29, శిఖర్ ధావన్ 68, హార్దిక్ పాండ్యా 30 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీ, గ్రాంధోమీ, శాంటర్, ఆడమ్ మిల్నీ చెరో వికెట్ చొప్పున తీశారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 43 ఓవర్లకి 215 పరుగులుగా ఉంది.