బాలకృష్ణ: ఓ రెస్టారెంట్ లో బాలకృష్ణ.. వైరల్‌గా మారిన వీడియో!

  • ఓ రెస్టారెంట్ లో ఆహారం తీసుకుంటున్న బాలయ్య
  • ఈ వీడియో ఏ సందర్భంలో, ఎవరు తీశారో తెలియదు
  • బాలయ్యతో పాటు మరెవరూ లేని వైనం

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఓ రెస్టారెంట్ లో ఒంటరిగా కూర్చుని ఆహారం తీసుకుంటున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. బాలయ్యతో పాటు మరెవరూ లేకపోవడం గమనార్హం. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ వీడియోను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ వీడియో ఏ సందర్భంలో, ఎక్కడ తీశారో తెలియదు. కాగా, ఈ వీడియోపై బాలయ్య అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన స్టార్ డమ్ ని సైతం బాలకృష్ణ లెక్కచేయరని, చాలా సింపుల్ గా ఉంటారని కితాబిస్తున్నారు. ఇదిలా ఉండగా, కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బాలయ్య హీరోగా నటిస్తున్నారు. ఆయన సరసన నయనతార నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

  • Loading...

More Telugu News