ఎన్టీఆర్: ‘ఎన్టీఆర్ అభిమానినని చెబుతావు! ఏఎన్నార్ చేతిలో ఎలా చచ్చిపోతావు?’.. నాటి షూటింగులో పరుచూరిని ప్రశ్నించిన కుర్రాళ్లు

  • నాటి సినిమా ‘బ్రహ్మరుద్రులు’ షూటింగ్ గురించి ప్రస్తావన
  • ‘పైసల్ లేక చస్తున్నావా అన్నా!’ అని కుర్రాళ్లు ప్రశ్నించారు
  • పిచ్చి అభిమానానికి ఈ సంఘటనే నిదర్శనం
  • ‘పరుచూరి పలుకులు’లో గోపాలకృష్ణ

నాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావుతో తన అనుభవాలను ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. ‘పరుచూరి పలుకులు’ వీడియోలో ఆయన మాట్లాడుతూ, ‘నాటి సినిమా ‘బ్రహ్మరుద్రులు’లో అక్కినేనికి విలన్ గా నేను నటించా. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ మొజాం జాహీ మార్కెట్ దగ్గర సంపూర్ణ అనే హోటల్ వద్ద జరుగుతోంది. ఆరోజున నా పాత్రను అక్కినేని గారు కాల్చి చంపేసే షాట్ తీస్తున్నారు. సుమారు వెయ్యి, పదిహేను వందల మంది యువత ఈ షూటింగ్ చూసేందుకు వచ్చారు. చప్పట్లు కొడుతూ నిలబడ్డారు.

అక్కినేని గారు నన్ను కాల్చిన సన్నివేశం అయిపోగానే పక్కకు వెళ్లి కూర్చున్నా. ఆ తర్వాత ఓ పది మంది కుర్రాళ్లు నా దగ్గరకు వచ్చారు. ‘పైసల్ లేక చస్తున్నావా అన్నా!’ అని వాళ్లు నాతో అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. ‘పైసల్లేక చచ్చిపోవడం ఏంటయ్యా?’ అని ప్రశ్నించా. ‘నువ్వు ఎన్టీఆర్ అభిమానినని చెబుతావు! ఏఎన్నార్ చేతిలో ఎలా చచ్చిపోతావు!’ అన్నారు. అంటే, అక్కినేని గారి చేతిలో ఎన్టీఆర్ అభిమానిగా ముద్రపడిపోయిన నేను (నా పాత్ర) చనిపోవడానికి వీల్లేదని వారి అభిప్రాయం. అభిమానుల హృదయం ఎలా ఉంటుందని చెప్పడానికే ఈ సంఘటన గురించి ప్రస్తావించా’ అని గోపాలకృష్ణ నవ్వులు చిందించారు.

  • Loading...

More Telugu News