కంచ ఐలయ్య: విజయవాడలో ఐలయ్య మద్దతుదారులు.. వైశ్య-బ్రాహ్మణ జేఏసీ నిర్వహించతలపెట్టిన సభలకు అనుమతుల నిరాకరణ!
- విజయవాడలోని జింఖానా గ్రౌండ్‌లో ఈ నెల 28న బహిరంగ సభలకు నిర్ణయం
- శాంతి భధ్రతల సమస్య కారణంగా అనుమతి నిరాకరణ
- జింఖానా గ్రౌండ్స్ వద్ద నిషేధాజ్ఞలు
ప్రొ.కంచ ఐలయ్య మద్దతుదారులు, సామాజిక ఉద్యమ జేఏసీ కలసి విజయవాడలోని జింఖానా గ్రౌండ్‌లో ఈ నెల 28న బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ఆ సభకు పోటీగా ఆర్యవైశ్య, బ్రాహ్మణ జేఏసీ కూడా అదే గ్రౌండ్‌లో అదే రోజు సభను నిర్వహించాలని అనుకుంది. ఇందు కోసం ఇరు వర్గాలు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాయి. దీనిపై స్పందించిన నగర పోలీసులు ఇద్దరికీ అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. అంతేకాకుండా, జింఖానా గ్రౌండ్స్ వద్ద పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. శాంతిభధ్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉన్న కారణంగా పోలీసులు ఈ సభలకు అనుమతి నిరాకరించారు.