అరుణ్ జైట్లీ: పోటాపోటీ.. నవంబర్ 8న విపక్షాలు బ్లాక్ డేకి పిలుపు... నల్లధన వ్యతిరేక దినోత్సవానికి బీజేపీ పిలుపు
- గత ఏడాది నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు
- వచ్చేనెల 8న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను జరపాలని విపక్షాల నిర్ణయం
- నల్లధన వ్యతిరేక దినోత్సవంలో బీజేపీ నేతలందరూ పాల్గొనాలని అరుణ్ జైట్లీ పిలుపు
గత ఏడాది నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వచ్చిందని, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని దేశంలోని విపక్ష పార్టీలన్నీ పెద్ద ఎత్తున వచ్చేనెల 8న నిరసన కార్యక్రమాలను జరపాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే నవంబర్ 8న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నల్లధన వ్యతిరేక దినం జరుపుతామని ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొంటారని చెప్పారు. నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలను ప్రజలకు వివరిస్తామని ఆయన అన్నారు.