క్రికెట్: పూణే వన్డే: ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
- ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 39 ఓవర్లకి 166
- టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ కి 3 వికెట్లు
- క్రీజులో గ్రాంధోమీ (36), శాంటర్ (0)
భారత్, న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌ల మధ్య పూణేలో జరుగుతోన్న రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తోన్న న్యూజిలాండ్ 165 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గుప్తిల్ 11, కోలిన్ మున్రో 10, కానె విలియమ్సన్ 3, టైలర్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన విషయం తెలిసిందే. ఆ తరువాత క్రీజులో రాణించిన టామ్ లాథమ్ 38, హెన్రీ నికోల్స్ 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో గ్రాంధోమీ 36, శాంటర్ 0 పరుగులతో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీయగా, బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్సర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 39 ఓవర్లకి 166గా ఉంది.