kapil dev: కపిల్ దేవ్ పై పొగడ్తల వర్షం కురిపించిన సునీల్ గవాస్కర్

  • ఎవరైనా కెప్టెన్ కావచ్చనే నమ్మకాన్ని కలిగించాడు
  • సిటీ నేపథ్యం లేని వ్యక్తి కపిల్
  • అయినా అతన్ని చూడ్డానికి జనాలు పోటెత్తేవారు

భారత క్రికెట్ లో గేమ్ ఛేంజర్ కపిల్ దేవ్ అని సునీల్ గవాస్కర్ కొనియాడారు. ఎవరైనా సరే భారత్ తరపున క్రికెట్ ఆడొచ్చు, కెప్టెన్ కూడా కావచ్చు అనే నమ్మకాన్ని కలిగించింది కపిలే అని చెప్పారు. ఒక నాన్ మెట్రో ప్రాంతం నుంచి వచ్చి క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడని పొగడ్తల వర్షం కురిపించారు.

సిటీ నేపథ్యం లేని ఓ వ్యక్తిని చూడ్డానికి జనాలు పోటెత్తారంటే అది కేవలం కపిల్ వల్లే సాధ్యమైందని చెప్పారు. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ రాసిన 'డెమోక్రసీస్ లెవెన్ - ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు.

సచిన్ కెప్టెన్ గా ఉన్నప్పుడు అతనికి ఒక సలహా ఇచ్చానని సన్నీ తెలిపాడు. టాస్ కోసం మైదానంలోకి వెళ్లే సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ వసీం అక్రమ్ నీ భుజాల మీద చేతులు వేస్తుంటాడని, అలా చేయనివ్వద్దని... ఎందుకంటే ఇది దేశభక్తికి సంబంధించిన విషయమని చెప్పానని అన్నారు. 

kapil dev
sunil gavaskar
team india
sachin tendulkar
wasim akram
  • Loading...

More Telugu News