pune: 'పిచ్ ఫిక్స్'కు ముందు క్యూరేటర్ పాండురంగ ఏమన్నాడంటే...!

  • పుణె పిచ్ మంచి బ్యాటింగ్ పిచ్
  • మంచి మ్యాచ్ జరుగుతుంది
  • ఇంతకుమించి ఇంకేమీ చెప్పలేను 
  • స్టింగ్ ఆపరేషన్ లో ఇరుక్కోవడానికి గంటల ముందు మీడియాతో పాండురంగ

పుణె క్రికెట్ మైదానంలోని పిచ్ ని ఫిక్సింగ్ చేయగలనని చెబుతూ మీడియా కంటికి చిక్కిన పాండురంగ సాల్గొంకర్, అంతకు కొన్ని గంటల ముందు మాట్లాడాడు. తనను కలిసిన 'క్రికెట్ నెక్ట్స్' ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ, "ఇది ఓ మంచి క్రికెట్ పిచ్. ఇక్కడో మంచి మ్యాచ్ జరుగుతుంది. మీడియాతో మాట్లాడేందుకు నాకు అనుమతి లేదు. ఈ సమయంలో ఇంకేమీ చెప్పలేను" అన్నాడట.

తొలి మ్యాచ్ లో జరిగినటువంటి అనుభవం భారత్ కు ఎదురు కాకపోవచ్చని కూడా అన్నాడట. ఆ తరువాత గంటల వ్యవధిలోనే 'ఇండియా టుడే'కు చెందిన విలేకరులు బుకీల మాదిరిగా వెళ్లి స్టింగ్ ఆపరేషన్ చేసి, పాండురంగ అసలు స్వరూపాన్ని బయట పెట్టిన సంగతి తెలిసిందే.

pune
cricket
pitch
india
newzeland
panduranga
  • Loading...

More Telugu News