gujarat assembly elections: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో గెలుపెవరిదో తేల్చి చెప్పిన ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే

  • మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై గుజరాతీల అసంతృప్తి
  • అయినా బీజేపీకే పట్టం
  • రాష్ట్రానికి మోదీ సాయం చేస్తున్నారనే భావనలో గుజరాతీలు

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అంశాలు బీజేపీపై ప్రజల్లో వ్యతిరేక భావాన్ని పెంచాయంటూ పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్న తరుణంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు ఇది నిజంగా శుభవార్తే. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉంటే... బీజేపీకి 43 నుంచి 47 స్థానాలు వస్తాయని వెల్లడించింది. గుజరాత్ లో 182 అసెంబ్లీ స్థానాలు ఉంటే 115 నుంచి 125 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని తెలిపింది.

గుజరాత్ లో బీజేపీకి 48 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 38 శాతం ఓట్లు పడతాయని సర్వేలో తేలింది. తమ రాష్ట్రానికి మోదీ అన్ని రకాలుగా సాయం చేస్తున్నారంటూ 66 శాతం మంది గుజరాతీలు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో జీఎస్టీపై 51 శాతం మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. 53 శాతం మంది పెద్ద నోట్ల రద్దును తప్పుబట్టారు. మోదీ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలు బాగోలేవని 66 శాతం మంది గుజరాతీలు అభిప్రాయపడ్డారు.

gujarat assembly elections
himachal pradesh assembly elections
india today survey on gujarat
narendra modi
amit shah
  • Loading...

More Telugu News