kamal hasan: క్షణానికోసారి దేశభక్తిని చాటాలని బలవంతం ఎందుకు?: కమలహాసన్ సూటి ప్రశ్న
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-81ba9029844d0c55d7f8aed5146c5f9bc9956362.jpg)
- సింగపూర్ లో రాత్రి పూట జాతీయగీతం ప్రదర్శిస్తారు
- దూరదర్శన్ లోనూ అలాగే చేయండి
- పలు ప్రాంతాల్లో జాతీయ గీతం వినిపిస్తూ, దేశభక్తిపై పరీక్షలు ఎందుకు?
- ట్విట్టర్ లో ప్రశ్నించిన కమలహాసన్
సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తూ, ఆ సమయంలో లేచి నిలబడాలన్న నిబంధనలను తొలగించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించిన వేళ, జాతీయగీతం చూపించే విషయంలో ఆది నుంచి వ్యతిరేకతను చూపుతున్న విలక్షణ నటుడు కమలహాసన్ మరోసారి స్పందించారు. పలు ప్రాంతాల్లో క్షణానికోసారి తన దేశభక్తిని చాటాలని బలవంతం చేయడం ఎందుకని అడిగాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, సింగపూర్ లో ప్రతి రోజూ రాత్రి జాతీయ గీతాన్ని టీవీ చానల్స్ లో ప్లే చేస్తుంటారని, అలాగే ఇండియాలోనూ చేయాలని సూచించాడు.