raja: అమరావతి భవనాలపై రాజమౌళి ఇచ్చిన సలహాలివి!

  • లండన్ వెళ్లి శాశ్వత భవనాలను పరిశీలించిన రాజమౌళి
  • వారసత్వానికి అద్దం పట్టేలా కట్టడాలు
  • అసెంబ్లీ ముందు నీటి కొలను, సూర్యకాంతి భవంతిపై ప్రతిబింబించాలి
  • అదే దృశ్యం పున్నమిలో మరింత అద్భుతమవుతుంది
  • రాజమౌళి ఆలోచనలకు ఓకే చెప్పిన నార్మన్ పోస్టర్స్

లండన్ వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబుతో కలసి నవ్యాంధ్ర రాజధాని అమరావతి శాశ్వత భవనాల డిజైన్లను పరిశీలించిన దర్శక దిగ్గజం రాజమౌళి పలు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలుగువారి ఘనమైన వారసత్వానికి అద్దం పట్టేలా ఈ కట్టడాలు ఉండాలని, అన్ని ప్రాంతాల ప్రజల మనసులకూ దగ్గరగా ఉండేలా డిజైన్లు ఉండాలని, వారు తమ ప్రాంత వైశిష్ట్యాన్ని ఈ డిజైన్లలో చూసుకోవాలని అన్నారు.

అందుకు ఉదాహరణగా, శాతకర్ణి వినియోగించిన జెండాలవంటివి అసెంబ్లీకి అన్ని వైపులా ఏర్పాటు చేసి, ప్రజలు వాటిని చూస్తూ తిరిగి వెళ్లేందుకు వీలుగా ఖాళీ స్థలాన్ని వదలాలని సూచించారు. చారిత్రకాంశాలను బొమ్మల రూపంలో నిలపాలని, వాటిని ఫొటో తీయగానే వివరాలు వచ్చేలా యాప్స్ తయారు చేయాలని, అమరావతి నిర్మాణానికి తెచ్చిన మట్టి, నీరు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రతి ఒక్కరికీ చెప్పేలా యాప్ ఉండాలని అప్పుడే ప్రతి ప్రాంతం వారూ రాజధానిలో తామూ భాగస్వామ్యమైనామని భావిస్తారని చెప్పారు.

అసెంబ్లీ భవనం ముందు కొలను ఉండాలని, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యకాంతి నీటిపై పడి, ప్రతిబింబించి భవంతిపై పడేలా చూడాలని కోరారు. అది చూపరులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని, పున్నమి వేళ అదే మహాద్భుతమవుతుందని రాజమౌళి చెప్పగా, నార్మన్ పోస్టర్స్ సంస్థ పూర్తిగా ఏకీభవించిందని సమాచారం. దూరం నుంచి చూస్తే ఒకేలా అసెంబ్లీ, హైకోర్టులు కనిపించాలని.. దగ్గరికి వచ్చే కొద్దీ వాటి రూపురేఖలు మారుతూ వేటికవి ప్రత్యేకంగా కనిపించేలా 'ఇంపోజింగ్ బిల్డింగ్' విధానంలో వీటిని కట్టాలని రాజమౌళి సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News