విజయవాడ: విజయవాడ దుర్గ గుడిలో లడ్డూ ధర పెంపు!

  • లడ్డూ ప్రసాదంతో పాటు వివిధ సేవల ధరలు పెంపు
  • దసరా ఉత్సవాల్లో పనిచేసిన ఉద్యోగులకు ప్రోత్సాహకం
  • పాలకమండలి నిర్ణయం

విజయవాడ కనకదుర్గమ్మ ప్రసాదాలతో పాటు వివిధ సేవల ధరలు పెరగనున్నాయి. ఈరోజు నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే.. లడ్డూ ధర రూ.10 నుంచి రూ.20కి పెంచాలని, శ్రీచక్ర లడ్డూను భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో దాని ధరను రూ.100 గా ఖరారు చేసింది. దుర్గ గుడికి వెళ్లే బస్సుల టిక్కెట్ ధర రూ.10 కి, తలనీలాల టిక్కెట్ ధర రూ.15 నుంచి రూ.20 కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మల్లికార్జున మహామండపం, కనకదుర్గనగర్ లో భక్తుల కోసం 2 షెడ్లు ఏర్పాటు చేయాలని, ఈ మండపం ద్వారా వచ్చే భక్తులకు ప్రస్తుతానికి ఉచితంగా లిఫ్ట్ సౌకర్యం కల్పించాలని, దసరా ఉత్సవాల్లో పని చేసిన ఉద్యోగులకు ప్రోత్సాహకంగా రూ.5 వేలు ఇవ్వాలని పాలక మండలి నిర్ణయించింది. 

  • Loading...

More Telugu News