యూపీ సీఎం: ఆలయాల్లో పూజల తర్వాత సమయం ఉంటే రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచిస్తారు: యూపీ సీఎంపై మాయావతి సెటైర్లు

  • అజాంగఢ్ లో మాయావతి ర్యాలీ
  • యోగి ఆదిత్య‌నాథ్ ఎల్ల‌ప్పుడూ ఆల‌యాల్లోనే క‌నిపిస్తు‌న్నారు
  • బీజేపీ పాలనలో నవ భారతం సాధ్యం కాదు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య నాథ్ దేవాలయాల్లో పూజలు చేసుకున్న తర్వాత సమయం ఉంటే రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచిస్తారని బీఎస్పీ అధినేత్రి మాయావతి సెటైర్లు వేశారు. ఈ రోజు అజాంగఢ్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ... ఆదిత్య‌నాథ్‌ వెనుకబడిన పూర్వాంచల్ నుంచి వచ్చిన నేతే అని, అయినప్పటికీ ఆయ‌న ఆ ప్రాంత‌ అభివృద్ధిపై దృష్టి పెట్టలేద‌ని ఆమె విమర్శించారు.

 యోగి ఆదిత్య‌నాథ్ ఎల్ల‌ప్పుడూ ఆల‌యాల్లోనే క‌నిపిస్తు‌న్నార‌ని ఆమె ఎద్దేవా చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ పాలనలో నవ భారతం సాధ్యం కాదని ఆమె వ్యాఖ్యానించారు. ఇంత‌కు ముందు యూపీలో అధికారంలో ఉన్న స‌మాజ్‌వాదీ పార్టీ క‌న్నా బీజేపీ మరింత దారుణంగా ఉంద‌ని ఆమె విమ‌ర్శించారు.  

  • Loading...

More Telugu News