బీబీనగర్: కుప్పకూలిన సభా వేదిక.. బీజేపీ నేత లక్ష్మణ్ కు తప్పిన ప్రమాదం!

  • బీబీనగర్ లో ప్రజా పంచాయతీ కార్యక్రమం నిర్వహించిన బీజేపీ
  • ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా కుప్పకూలిన వేదిక
  • ఒకరిద్దరికి గాయాలు
  • భయాందోళనలో ప్రజలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా బీబీనగర్ లో బీజేపీ నిర్వహించిన ప్రజా పంచాయతీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ  సందర్భంగా వేదికపై నుంచి లక్ష్మణ్ ప్రసంగిస్తున్నారు. అయితే, అదే సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో వేదిక ఉన్నపళంగా కుప్పకూలింది. ఈ ఘటనలో లక్ష్మణ్ కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఒకరిద్దరు వ్యక్తులకు గాయాలైనట్టు సమాచారం. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు.

  • Loading...

More Telugu News