: రేపు బాబు ఢిల్లీ పయనం
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. నాటకీయ పరిణామల నేపథ్యంలో బాబుకు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ను కలిసిన తర్వాతే బాబుకు పిలుపు అందడం గమనార్హం. కాగా, రేపు జరగనున్న విగ్రహావిష్కరణకు బాబుతో పాటు ఎంపీలు, మాజీ ఎంపీలు కూడా హాజరవుతారు.