పూరీ జగన్నాథ్: 'మెహబూబా' సెట్స్ లోని ఫొటోని పోస్ట్ చేసిన దర్శకుడు పూరీ!

  • ఓ ఫొటోను పోస్ట్ చేసిన పూరీ
  • ‘మెహబూబా’ సెట్స్ లో దిగినట్టు సమాచారం
  • ఆ శునకాన్ని తదేకంగా చూస్తున్న పూరీ

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మెహబూబా’ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పూరీ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా నటిస్తున్నాడు. ఆ యువహీరో సరసన నేహాశెట్టి నటిస్తోంది. కాగా, పూరీ ఓ ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో తాజాగా పోస్ట్ చేశారు.

ఒక బండపై కూర్చుని ఉన్న పూరీ జగన్నాథ్ చేతిలో సిగిరెట్, ఆయన పక్కనే నిలబడి ఉన్న ఓ శునకం ఈ ఫొటోలో ఉన్నాయి. ఆ శునకాన్ని తదేకంగా చూస్తున్న పూరీ తన చేతిని దానిపై ఉంచారు. ‘మెహబూబా’ సెట్స్ లో ఈ ఫొటో దిగినట్టు సమాచారం. ‘మిమ్మల్ని అభిమానులే కాదు జంతువులు కూడా ఇష్టపడతాయి సార్’, ‘ఆ శునకం పేరేంటండి?’, ‘పెట్ లవర్’, ‘సూపర్ సార్’ అని నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News